దాడులు జరిగిన టిడిపి నేతలకు సంబందించిన ఒక కంపెనీ తాము అరవై కోట్ల మేర ఆదాయాన్ని చూపించలేదని ఒప్పుకుని పన్ను కట్టడానికి అంగీకరించడం విశేషం.టిడిపి అధిష్టాన వర్గానికి సన్నిహితంగా భావించే పేరం హరిబాబుకు చెందిన పేరం గ్రూప్ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఐటి శాఖ అదికారులు సోదాలు చేశారు.విశాఖపట్నం, తిరుపతి,బెంగుళూరులలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే ఈ సంస్థలో సోదాలు జరపగా కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు దొరికాయి.విశాఖపట్నంలో ముఖ్యమైన పత్రాలు కొన్నిటిని ఎవరికి కనిపించకుండా కంపెనీ జాగ్రత్త చేసినా, ఐటి సిబ్బంది కనుగొనగలిగారని టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కధనాన్ని ఇచ్చింది.సోదాల తర్వాత అరవై కోట్ల మేర ఆదాయాన్ని లెక్కలలో చూపలేదని ఆ సంస్థ అంగీకరించిందని ఆదాయ పన్ను వర్గాలు వెల్లడించాయి. దీని ప్రకారం ఇందులో ముప్పై శాతం అంటే సుమారు ఇరవై కో్ట్ల రూపాయల వరకు పన్ను చెల్లించడానికి కంపెనీ అంగకరించిందని ఆ కదనం చెబుతోంది.పేరం హరిబాబు , టిడిపి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు వియ్యంకులు అవుతారు. ఇలా పన్ను కట్టడం కూడా తప్పేనని చంద్రబాబు అంటారా?